కజికిస్తాన్‌లో చమురు ధరల రగడ తారాస్థాయికి చేరింది. గత కొంతకాలంగా చమురు ధరలను అక్కడి ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. దీంతో ఆ దేశంలోని అనేక నగరాల్లో ప్రజలు, ఆందోళనకారులు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు చేశారు. పోలీసులు నిరసనలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు పెద్దవి కావడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.
Read: కరోనాకు వయాగ్రా ఔషదం: కోమా నుంచి కోలుకున్న మహిళ…
అటు నిరసనకారులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కజికిస్తాన్ అధ్యక్షుడు కశ్యం జొమ్రాట్ తొకయోవ్, ఆయన ప్రభుత్వం విధుల నుంచి తప్పుకుంది. చమురు ధరలు 100 శాతం పెరగడంతో నిరసనకారులు నిరసనలు చేస్తున్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ రోడ్లపైకి వచ్చారు. అయితే, పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో వందలాది మంది ఆందోళనకారులు గాయపడ్డారు. సుమారు 100 మంది పోలీసులకు గాయాలయ్యాయి.