దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: Elon Musk: మోడీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత్‌కి వస్తా..
ఢిల్లీలోని సీలంపూర్‌లో 17 ఏళ్ల కునాల్ అనే బాలుడిని గురువారం సాయంత్రం దుండగులు కత్తులతో పొడిచి చంపారు. పాలు తీసుకురావడానికి వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్యను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇక ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: YSRCP: విశాఖ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్..! వారిపై వైసీపీ ఫిర్యాదు
ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అయితే ఈ హత్య ప్రతీకార హత్యగా భావిస్తున్నారు. హత్యకు కుట్రపన్నిన జిక్రా అనే లేడీడాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. షోయబ్-మస్తాన్ ముఠాకు సంబంధించిన వారిగా పోలీసులు కనుగొన్నారు. గత నవంబర్‌లో జరిగిన కత్తిపోటు ఘటనకు ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ ఘర్షణలో నిందితుల్లో ఒకడు గాయపడ్డాడు. దానికి కునాలే కారణంగా భావించాడు. అందుకు ప్రతీకారంగా గురువారం కునాల్‌ను హతమార్చారు. జిక్రా ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..
కునాల్ ఆస్పత్పిలో చికిత్స పొందుతూ మరణించాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (హత్య) కింద సీలంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సమోసాలు, పాలు కొనడానికి కునాల్ బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మమ్మ దగ్గర నుంచి కునాల్ అప్పుడే వచ్చాడని.. అంతలోనే హత్యకు గురయ్యాడని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Viral Video: స్టేజీపై ‘పుష్ప 2’ పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం.. రచ్చ రచ్చే (వీడియో)