తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం పరితపించిన అరుదైన నిర్మాతల్లో డి.వి.ఎస్. రాజు ఒకరని చెప్పకతప్పదు. రాష్ట్ర, జాతీయ చిత్రపరిశ్రమ అభివృద్ధి సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించిన రాజు, తాను ఏ హోదాలో పనిచేసినా ప్రతీసారి తెలుగు సినిమా రంగం కోసం తపించారు. అందుకే తెలుగు సినీజనం ఆయనను ‘భీష్మాచార్యులు’ అంటూ అభిమానంగా పిలుచుకొనేవారు. డి.వి.ఎస్. పూర్తి పేరు దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరంలో ఆయన జన్మించారు. వారి…