తెలుగు చిత్రసీమలో ప్రఖ్యాత నిర్మాణసంస్థలుగా వెలుగు చూసిన వాటిలో ‘వైజయంతీ మూవీస్’ స్థానం ప్రత్యేకమైనది. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభమైంది. ఈ సంస్థాధినేత చలసాని అశ్వనీదత్ చిత్రసీమలో ప్రముఖస్థానం సంపాదించారు. యన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు అశ్వనీదత్. తరువాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరువాతి తరం అగ్రకథానాయకులతోనూ చిత్రాలను నిర్మించి జనం మదిలో మరపురాని స్థానం సంపాదించారు…