Congress: కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా మద్దతు ర్యాలీలు చేపడుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నేతృత్వంలో కోజికోడ్‌లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో పాటు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ హాజరయ్యారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్రమోడీలు ఇద్దరు ఒకే రకం అని ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Congress: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఈ వివాదంపై ఇటు అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా కోసం సంఘీభావ ర్యాలీలు చేస్తున్నాయి. ఉగ్రదాడికి గురైన ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపకపోగా పాలస్తీనా, హమాస్‌కి మద్దతుగా ర్యాలీలు ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.