Congress: ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఒకే రకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కేరళలో అధికార సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా మద్దతు ర్యాలీలు చేపడుతున్నాయి. గురువారం కాంగ్రెస్ నేతృత్వంలో కోజికోడ్‌లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో పాటు మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ హాజరయ్యారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్రమోడీలు ఇద్దరు ఒకే రకం అని ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Read Also: Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడి..
Also Read
నెతన్యాహు, మోడీలు ఒకే రకం..ఒకరు జియోనిజం గురించి, మరొకరు జాతి ప్రక్షాళన గురించి ఆలోచిస్తున్నారని కేసీ వేణుగోపాల్ విమర్శించారు. కేరళ పీసీసీ ఆధ్వర్యంలో కోజికోడ్ బీచ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పాలస్తీనా ప్రజలు తమ జన్మభూమి కోసం పోరాడుతున్నారని, ఆ పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీ వేణుగోపాల్ అన్నారు. అమెరికా ఎల్లప్పుడూ వలస రాజ్యాలకు మద్దతు ఇస్తుందని, అందుకే ఇజ్రాయిల్‌కి మద్దతు ఇస్తుందని అన్నారు. ఇజ్రాయిల్‌కి మద్దతు ఇవ్వడానికి మోడీ చాలా తొందరలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో అవలంభిస్తు్న్న పాలస్తీనా వైఖరికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విరుద్ధంగా ఉందని, ఇజ్రాయిల్-హమాస్ మానవతా సంధికి అనుకూలంగా భారత్ ఓటేయకపోవడాని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. గాంధీ దేశం ఓటేయలేదని అన్నారు. గతంలో అధికార సీపీఎం కూడా పాలస్తీనా సంఘీభావ ర్యాలీ చేసింది. దీనికి సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. భారత్, ఇజ్రాయిల్‌తో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!