కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటూ..‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై వాయిస్ నివేదికను ఎఫ్ఎస్ఎల్‌కి పంపగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టయిన ముగ్గురు ఢిల్లీకి చెందిన ఇల్తాజ్,…