Khalistan: ఖలిస్తానీ అనుకూలవాదులు విదేశాల్లోనే కాదు, దేశంలో కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హిందువుల దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనిపై ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం దర్యాప్తు చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ దేశానికి మద్దతుగా ఉన్న ఈ…