Ind A vs Aus A: భారత్-A, ఆస్ట్రేలియా-A జట్ల మధ్య కాన్పూర్‌లో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్-A 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-A నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (110), ప్రియన్స్ ఆర్య (101) సెంచరీలతో మెరిశారు. వీరితో పాటు రియాన్ పరాగ్ (67), ఆయుష్ బడోని (50), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (56) అర్ధ…
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది.
IPL 2025 Final PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచి అభిమానుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు మెరుపు ప్రదర్శన చేస్తూ రాణించింది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. మరి రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దామా.. Read Also: IPL 2025 Final RCB:…
రెండు నెలలుగా అభిమానుల్ని ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజుతో ముగుస్తుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కల నెరవేరుతుంది. అయితే ఆర్సీబీనే గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్‌కి తొలిసారి ఆడుతున్నాడు. కోహ్లీ పదిహేడేళ్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ గెలిస్తే చూడాలని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్‌కతాకు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. Also Read:Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. టాస్…
‘ప్రియాంశ్ ఆర్య’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌పై మెరుపు సెంచరీ (103; 42 బంతుల్లో 7×4, 9×6) చేయడమే ఇందుకు కారణం. ఐపీఎల్‌లో ఆడిన నాలుగో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా ప్రియాంశ్ నిలిచాడు. అంతేకాదు అత్యంత వేగవంతమైన శతకం బాదిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన…
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 39 బంతుల్లో శతకం బాధగా.. మొత్తంగా 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 చేశాడు. ప్రియాంశ్ చెలరేగడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసి.. విజయం సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంశ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఎవరిని కదిలించినా.. ప్రియాంశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ప్రియాంశ్ గురించి పంజాబ్…
ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు.. దేశవాళీలో పాతిక మ్యాచ్‌లు కూడా ఆడలేదు.. పైగా టీ20 ఫార్మాట్‌లో పెద్దగా అనుభవం లేదు.. అయినా ఓ కుర్రాడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.3.80 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఆ సమయంలో ‘కుర్రాడికి ఎందుకు అంత డబ్బు’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. ఐపీఎల్ 2025లో మెరుపు సెంచరీతో దుమ్ములేపాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి పేరు సోషల్…
పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ముల్లాన్‌పుర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ బాదడంతో ప్రియాంశ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో…
PBKS vs CSK: మొహాలీ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానితో బ్యాటింగ్ మొదలు పెట్టిన పంజాబ్ పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ చివరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ మొదట్లో వికెట్లు వరుసగా పడిపోతున్న, కానీ వారి రన్ రేట్‌లో ఎటువంటి తగ్గుదల కనిపించలేదు. దీనితో టాస్ గెలిచి…