ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్‌కతాకు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Also Read:Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు శుభారంభం లభించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య ఊచకోతకు తెరలేపారు. కోల్‌కతా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఇద్దరు 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్య 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ప్రభ్‌సిమ్రాన్ దంచికొట్టాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత చెలరేగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 49 బంతుల్లో 83 పరుగులు చేశాడు. కెప్టెన్ అయ్యర్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.