IPL 2025 Final PBKS: బ్యాటింగ్ ఓకే.. మరి బౌలింగ్ పరిస్థితేంటి..? కొత్త ఛాంపియన్‌గా పంజాబ్ నిలుస్తుందా..?
- మెరుపు ఇన్నింగ్స్ ఆడే ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రాన్ ల ఓపెనింగ్ జోడీ
- 600 కి పైగా పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ అసాధారణ ఇన్నింగ్స్
- ఒత్తిడిని దాటి ధీటుగా ఆడే ఇంగ్లిష్, స్టోయినిస్
- మిడిల్ ఆర్డర్ లో చెలరేగే నేహాల్ వధేరా, శశాంక్ సింగ్
- పరుగులు ఇవ్వకపోయినా వికెట్లు తీయలేకపోతున్న అర్షదీప్ సింగ్..
- వికెట్లు తీస్తున్నా.. ధారాళంగా పరుగులు ఇస్తున్న జేమిసన్
- ఏమాత్రం ఫామ్ లో లేని అజ్మతుల్లా..
- చహాల్ పైనే భారం అంతా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Final PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచి అభిమానుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు మెరుపు ప్రదర్శన చేస్తూ రాణించింది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. మరి రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దామా..
Read Also: IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
పంజాబ్ బ్యాటింగ్‌లో మీరు ఇన్నింగ్స్ అదే ఓపెనింగ్ జోడీగా ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రాన్ నిలిచారు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలో మంచి ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడికి నెట్టేస్తున్నారు. వీరి తరువాత వచ్చే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత సీజన్‌లో ఎప్పుడు లేనంత అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 600కి పైగా పరుగులు చేసి పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిని అధిగమించి నిలకడగా ఆడుతూ ఇంగ్లిష్, హ్యారీ బ్రూక్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా పంజాబ్ మిడిల్ ఆర్డర్‌కు మంచి స్కోర్ ను అందిస్తున్నారు. వీరికి తోడుగా నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ జట్టుకు భారీ స్కోర్ల దిశగా తీసుకెళ్తున్నారు.
Read Also: Phil Salt: ఆర్సీబి ఊపిరి పీల్చుకో.. అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్..!
అయితే, పంజాబ్ బౌలింగ్ విభాగమే జట్టుకు ప్రధాన బలహీనతగా కనపడుతుంది. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ పరిమిత పరుగులు ఇవ్వడంలో విజయవంతం అవుతున్నా, తక్కువ వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు, కైలె జేమిసన్ మంచి వికెట్లు తీస్తున్నా అతని బౌలింగ్‌లో భారీగా పరుగులు వస్తున్నాయి. ఇక అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మాత్రం పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ స్పిన్ ఆశలు యూజవేంద్ర చహాల్ మీదే ఆశలు ఉన్నాయి. చహాల్ అనుభవంతో పాటు వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నాడని గత మ్యాచ్‌లు సూచిస్తున్నాయి. బౌలింగ్‌లో ఉన్న లోటును పూడ్చడానికి చహాల్ పై బరువు మోసే అవకాశముంది. మొత్తంగా పంజాబ్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను నెగ్గే ప్రయత్నం చేస్తుందన్నది స్పష్టమవుతోంది. కానీ, బౌలింగ్‌లో తగినంత మద్దతు లేకుంటే కష్టమే. అభిమానులు మాత్రం ఈసారి టైటిల్ పంజాబ్‌కే రావాలని ఆశపడుతున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!