Congress: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ‘‘నిందించే వ్యాఖ్యలు’’ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ‘‘సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం’’ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నోటీసుల్ని సభలో ప్రవేశపెట్టారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు.