మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పెద్ద బండరాయిని ఢీ కొట్టి బస్సు నిలిచిపోవడంతో 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కు పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. Also Read:Paris: పీఎస్‌జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ.. ఇద్దరు…
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా... 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది.
రన్నింగ్ బస్సు టైర్ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు.
కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని బాపులపాడు హైవేపై పైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి హైవే పైనే బస్సు నిలిచిపోయింది. అయితే, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్ పాత్ పైకి నుంచి డాబావైపు ప్రైవేటు బస్సు దూసుకొని వచ్చింది.
ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. తెలంగాణ నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.. ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది… బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే…
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలసిపోయి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, అయితే వారిలో ఐదుగురికి గాయాలయ్యాయి , పోలీసులు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీకావేరి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ27యూబీ5465 నంబరు గల బస్సు బుధవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరి గురువారం ఉదయం కనిగిరి చేరుకోనుంది. దర్శి మండలం…