మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు.…
ఇప్పుడు ఏ సినీ పరిశ్రమలో చూసినా ఓటీటీ మాటే వినిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లకు తాళలు పడటంతో అంతటా డిజిటల్ రిలీజ్ ల చర్చ సాగుతోంది. మలయాళ సినిమా ఇందుకు మినయింపు ఏం కాదు. తాజాగా రెండు స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. స్వయంగా నిర్మాతే థియేటర్లకు వచ్చేది లేదని చెప్పటంతో ఫాహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ రాబోయే చిత్రాల గురించి సొషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు… మలయాళ…
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అక్కడి ప్రజల మనోభావాలను ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ యూనియన్ టెర్రీటరీ. అక్కడ ఎంపీగా ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఇటీవల లక్ష్యద్వీప్ లో అధికారులు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నేరాలు జరగని ప్రాంతంలో అధికారులు…