మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సత్యజిత్ ఐపీఎస్ గా పృథ్వీరాజ్ నటిస్తున్నాడు.
Also Read : బర్త్ డే రోజు కాజల్ కు భర్త స్పెషల్ విషెస్…!
చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ పృథ్వీరాజ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఉత్కంఠ భరితంగా సాగింది. హత్య ఎలా ? ఎందుకు జరిగింది? ఎవరు చేశారు ? అనే విషయాలను పృథ్వీరాజ్ ఎలా కనిపెట్టాడో తెలుసుకోవాలనే ఆతృత పెరుగుతోంది. సినిమాపై ఆసక్తిని పెంచేసిన ఈ హార్రర్ థ్రిల్లర్ టీజర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.