ఇప్పుడు ఏ సినీ పరిశ్రమలో చూసినా ఓటీటీ మాటే వినిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లకు తాళలు పడటంతో అంతటా డిజిటల్ రిలీజ్ ల చర్చ సాగుతోంది. మలయాళ సినిమా ఇందుకు మినయింపు ఏం కాదు. తాజాగా రెండు స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. స్వయంగా నిర్మాతే థియేటర్లకు వచ్చేది లేదని చెప్పటంతో ఫాహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ రాబోయే చిత్రాల గురించి సొషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…
మలయాళ నిర్మాత యాంటో జోసెఫ్ రెండు భారీ చిత్రాలు విడుదల చేయాల్సి ఉంది. అందులో ఒక ఫాహద్ ఫాసిల్ నటించిన ‘మాలిక్’ కాగా రెండోది పృథ్వీరాజ్ నటించిన ‘కోల్డ్ కేస్’. ఇవి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. కానీ, కేరళలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నో రోజులుగా లాక్ డౌన్ విధిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ తో రెండు చిత్రాలు కూడా ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఆర్దిక చిక్కుల్లో పడ్డ నిర్మాత ‘మాలిక్, కోల్డ్ కేస్’ సినిమాల్ని ఓటీటీ ద్వారా జనం ముందుకు తీసుకు వస్తానని చెబుతున్నాడు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవటం… తెరుచుకున్నాక కూడా 50 శాతం ప్రేక్షకుల్నే అనుమతిస్తారన్న ప్రచారం… నిర్మాతల్ని ఓటీటీల వైపు నెడుతోంది. ఫాహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ లాంటి హీరోలకు మల్లూవుడ్ తో మంచి క్రేజ్ ఉన్నా నిర్మాత యాంటో జోసెఫ్ ఆన్ లైన్ కే ఓటువేశాడు. త్వరలో ఆయన నిర్మించిన రెండు సినిమాలు ‘మాలిక్, కోల్డ్ కేస్’ అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావచ్చునంటున్నారు. డిజిటల్ రిలీజ్ ని కన్ ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్ ఇంకా ఏ ఓటీటీలో మూవీస్ రాబోతున్నాయో క్లారిటీ ఇవ్వలేదు.