మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన “కురుతి” చిత్రం ఆగస్టు 11 నుండి డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మను వారియర్ దర్శకత్వం దర్శకత్వంలో అనీష్ పల్యాల్ రచించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం గురించి మాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్ వల్లిక్కున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!
ఇటీవలే “కోల్డ్ కేస్”తో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ఓటిటిలోనే రిలీజ్ అయ్యింది. మరోసారి పృథ్వీరాజ్ ఓటిటి బాట పట్టడం విశేషం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ “కురుతి” అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రం కథ సరిహద్దులు దాటిన మానవ సంబంధాలు, ద్వేషం, పక్షపాతం వంటి వాటిపై పోరాటం. “కురుతి” మే 13, 2021న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కాని కరోనా మహమ్మారి కారణంగా మేకర్స్ దానిని వాయిదా వేయాల్సి వచ్చింది.