ప్రధాని మోడీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రోమ్‌లో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు.ఈ నెల 29 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఇటలీ, బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని.. 6వ జీ-20, కాప్-26, వరల్డ్ లీడర్స్శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో ఉండనున్న మోడీ.. మొదట రోమ్‌కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు.
ఇందులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది 8వ సారి. 2023లో ఈ సమావేశానికి భారత్ వేదిక కాబోతోంది. జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్-26 సదస్సుకు హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఆ తరువాత భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!