Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) రంగరాజన్‌ను వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమవుతున్న రంగరాజన్, సౌందర్య…