శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ…
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక…
మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు.
ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమించి శాంతి స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆఫ్రికా దేశాలు రష్యాను కోరుతున్నాయి. ఈ మేరకు ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయి.
ఉక్రెయిన్ దేశంపై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ పర్వంలో ఇవాళ (శనివారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Explosion On Bridge : ఉక్రెయిన్ పై రష్యా సైన్యం విధ్వంసానికి దిగింది. తన బలగంతో దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడిని ఉద్ధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై…
More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు…
Russian President is seriously ill: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత శనివారం తెల్లవారుజామున పుతిన్ తీవ్రంగా వాంతులతో బాధపడినట్లు రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్వీఆర్ చెప్పింది. వెంటనే పుతిన్ అత్యవసర వైద్య బృందం హుటాహుటీన అధ్యక్ష కార్యాలయాని చేరుకుని చికిత్స అందించినట్లు వార్తలను వెల్లడించింది.