ఉక్రెయిన్ దేశంపై రష్యా కొనసాగిస్తున్న యుద్ధ పర్వంలో ఇవాళ (శనివారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ చెప్పుకొచ్చాడు.
Also Read: KTR Visit to Warangal: నేడు వరంగల్‌లో కేటీఆర్ పర్యటన.. అజంజాహిమిల్స్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ
కాగా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి క్రెమ్లిన్ అణ్వాయుధాలను ఉపయోగించాలని యోచిస్తున్న సూచనలు లేవని యూఎస్ ప్రభుత్వం వెల్లడించింది. పుతిన్ వ్యాఖ్యల తర్వాత అమెరికా విదేశాంగ శాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్ హాట్ కామెంట్స్ చేశారు. రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు మాకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదు అని ఆంటోనీ బ్లింకెన్ తెలిపాడు.
Also Read: Mira Road Case: మృతదేహాలను ఎలా పారవేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి నరికి పారేశా
బెలారస్ రష్యాకు కీలకమైన మిత్రదేశం.. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా పనిచేసింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను బెలారస్‌కు తరలించడం ఈ నెల చివరి నాటికి పూర్తవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం గురించి ఫోరమ్ మోడరేటర్ అడిగినప్పుడు.. పుతిన్ ఇలా సమాధానమిచ్చారు.
Also Read: Road Accident: శనిదోష నివారణ పూజ కోసం వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి
ఇవి ముఖ్యంగా.. టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలు యుద్ధభూమిలో శత్రు దళాలను వారి ఆయుధాలను నాశనం చేయడానికి వీటిని ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్ లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన మిస్సైళ్లు, బాంబులు తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఈ అణ్వాయుధాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధికంగా శక్తిమంతమైనవని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ధ్రువీకరించారు.