Explosion On Bridge : ఉక్రెయిన్ పై రష్యా సైన్యం విధ్వంసానికి దిగింది. తన బలగంతో దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడిని ఉద్ధృతం చేసింది. రష్యా ఆక్రమించిన అనేక ప్రాంతాలకు విముక్తి కలిగించింది. దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై పూర్తి నియంత్రణను ఆ దేశం సాధించలేకపోతోంది. ముఖ్యంగా ఖేర్సన్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది.
రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం.. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పేలుడులో ఉక్రెయిన్ పాత్ర ఉన్నట్టు తేలితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ బలగాలు ఈ వంతెనను పేల్చేసినట్టు రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.
Read Also: Indo American: కొడుక్కి విడాలిస్తానన్న కోడల్ని వెతికి మరీ చంపిన మామ
అయితే శనివారం ఉదయం ఖార్కీవ్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే క్రిమియా బ్రిడ్జ్‌పై కూడా పేలుడు సంభవించింది. బ్రిడ్జ్‌పై జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ష్యాలో విలీనమైన క్రిమియాను ప్రధాన భూభాగానికి కలిపే కీలకమైన వంతెనను భారీగా ధ్వంసం చేసిన పేలుడుపై దర్యాప్తు ప్రారంభించినట్లు రష్యా పరిశోధనా కమిటీ పేర్కొంది. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు “రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. మరోవైపు, ఉక్రెయిన్ దేశానికి మరిన్ని ఆయుధాలు పంపేందుకు అమెరికా సిద్ధమైంది. కొత్తగా 625 మిలియన్ డాలర్ల సైనిక సాయం ప్రకటించింది.
Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022