ఈ రోజు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు…
ప్రధాని నరేంద్ర మోడీపై, భారత పౌరులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి.