ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం మాల్దీవులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోడీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు స్వయంగా ఘన స్వాగతం పలికారు. ఈరోజు, రేపు మోడీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. శనివారం మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికి మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్‌లో భారీ దోపిడీ.. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి చోరీ
నాలుగు రోజుల్లో రెండు విదేశీ పర్యటనల కోసం మోడీ యూకే, మాల్దీవులకు బయల్దేరి వెళ్లారు. బుధ, గురువారాల్లో లండన్‌లో పర్యటించారు. యూక్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. లండన్ టూర్ ముగించుకుని శుక్రవారం ఉదయం మోడీ మాల్దీవులు చేరుకున్నారు. శుక్రవారం మాలే ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రితో సహా ఆ దేశ సీనియర్ కేబినెట్ సభ్యులంతా ఘన స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!
గతేడాది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో మాల్దీవుల టూరిజాన్ని భారతీయులు బాయ్‌కట్ చేశారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం.. భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి ముయిజ్జు స్వయంగా హాజరై.. తిరిగి భారత్ సంబంధాన్ని బలపరుచుకున్నారు. అనంతరం మరోసారి ఢిల్లీలో పర్యటించి బంధాలను ధృడపరుచుకున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడంతో పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంది.