దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలలో భాగంగా ఈనెల 12న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఏపీ పర్యటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు…
. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే.. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా తన పేరును చరిత్రలో లిఖించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు.. విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి ఓకే చెప్పాయి..
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. దోవల్ పేరును పరిశీలిస్తోంది..
త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది..