కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు.
Women Reservation Bill: చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల పార్లమెంట్ లోని ఉభయసభలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజులో 73వ ఏట అడుగుపెట్టారు.రాష్ట్రపతితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. దేశ నాయకుల
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 ప్రత్యేక విందు కోసం ప్రపంచ నాయకులు భారత్ మండపానికి చేరుకోగా ఉన్నారు మరియు వారికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు.
న్యూ ఢిల్లీ అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి యూఎన్ రికార్డులలో ఇండియా పేరును భారత్‌గా మారుస్తుందని గ్లోబల్ బాడీ ప్రతినిధి ఈరోజు వెల్లడించారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.