18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పదవీకాలం ముగిసిన కేంద్ర మంత్రి మండలికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మోడీ 2.0 ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేశారు. త్వరలోనే మోడీ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఎన్డీయే నేతలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి…
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శనివారం లేఖ రాశారు. కేంద్రం సైన్యంలో ప్రవేశపెట్టిన ‘‘అగ్నిపథ్’’ పథకానికి వ్యతిరేకంగా లేఖలో పలు అంశాలను లేవనెత్తారు
PM Modi: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని అన్నారు.
వేసవి విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో పద్మశ్రీ పురస్కరాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అవార్డు గ్రహీతులకు పురస్కరాలు అందజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు.
Bharat Ratna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్గజాలకు నేడు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. మరణానంతరం పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.
భారత దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవాళ ఉదయం అందజేశారు.
ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసారు. ప్రెసిడెంట్ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.