NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 100 Rupees Coin: టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకార్థం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కార్యక్రమ అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి.. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు లక్ష్మీపార్వతి.
ఎన్టీఆర్‌తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి.. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.. కాగా, ఎన్టీఆర్ చిత్రం ఉన్న వంద రూపాయల నాణెంను ఈ నెల 28న విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయలు నాణాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొనగా.. ఇప్పుడు లక్ష్మీ పార్వతితో లేఖతో కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
కాగా, ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన ఆ వంద రూపాయల కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండనుంది.. ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగీ, ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పికే పేర్కొన్న విషయం విదితమే.. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉండనుండగా… మరోవైపు ఎన్టీఆర్ చిత్రం.. దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇది హిందీలో రాయబడి ఉంటుంది ఇప్పటికే ఆర్బీఐ పేర్కొన్న విషయం విదితమే.

తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!