ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.
గర్భిణులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.
Pregnant Women: ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక… డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణం వారి ప్రాణాల మీదకు కూడా తెలుస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో డోలీలో ఆస్పత్రికి వెళ్లిన ఓ తల్లి… కడపులోనే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పనసబంద గ్రామానికి చెందిన గర్భిణి బానుకు ఈ ఉదయం పురిటి నెప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో… గ్రామస్తులు, కుటుంబ సభ్యులు…
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా.. ప్రస్తుతం ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది.
తల్లీపిల్లల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటిని పంపిణీ చేయనున్నారు.
తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తన బిడ్డలకు ఆ కష్టం తెలియకుండా పెంచుకుంటుంది అమ్మ. దేవుడు తాను అంతటా ఉండలేకే అమ్మను సృష్టించాడు. కడుపులో బిడ్డ పెరుగుతున్నాడనే విషయం దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చేవరకు తానే అన్నీ వుండి పెంచుతుంది ఆకన్న తల్లి. అలాంటి తల్లికి గర్భంలో నలుసు పెరుగుతుంటే తనుఎన్నికష్టాలు ఎదుర్కొంటుందో తెలుసా.. ఆమెలో నెల నెలకు పెరుగుతున్న బరువుతో పడుకోవడానికి కూడా ఎంతగా కష్టపడుతుందో ఆతల్లికి మాత్రమే తెలుసు. అయితే కడుపులో నలుసు…
అసలే గర్భిణి. నిత్యం మద్యం సేవించి వేధించే భర్త..బిడ్డ కోసం అన్నీ భరించాలనుకున్నా వీలు కాలేదు. అమ్మగారి ఇంటికి వెళ్లాలని నడక మొదలుపెట్టిందా యువతి.తిరుపతి నుంచి రెండు రోజుల పాటు నడిచి 65 కిలోమీటర్ల దూరంలోని నాయుడు పేటకు చేరుకుంది. స్థానికుల సహకారంతో బిడ్డకు జన్మనిచ్చింది. రాజమహేంద్రవరంలోని వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన వర్షిణి దంపతులు పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లారు. నిత్యం భర్త మద్యం సేవించి వేధిస్తుండటంతో వర్షిణి తట్టుకోలేక పోయింది. నిండు చూలాలు కావడంతో తనను…
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముగిసినట్టే భావిస్తున్నా.. రాబోయే కాలంలో మరిన్ని వేరియంట్లు ఇబ్బంది పెడతాయంటున్నారు నిపుణులు. మరోవైపు దేశవ్యాప్తంగా గర్భిణులకు కోవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా గతంలో గర్భిణులకు వ్యాక్సిన్ విషయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. డాక్టర్లు తొలుత వద్దన్నా.. తర్వాత వారికి కూడా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. దేశంలో గర్భిణులకు వ్యాక్సినేషన్ విషయంలో మధ్యప్రదేశ్ ముందు స్థానంలో వుంది. తెలంగాణ చివరిస్థానంలో…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. గర్భిణీ ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ కొత్తగా జీరా చేసిన సర్క్యులర్‌పై వివాదం మొదలైంది.. దీనిపై స్పందించిన ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.. ఇక, వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.. అయితే, అన్ని రకాల నుంచి వివాదులు చుట్టుముట్టడంతో.. ఎస్బీఐ దిగొచ్చింది.…
దేశంలో కరోనా భయం వీడలేదు. కనిపించని శత్రువు సవాల్ విసురుతోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ, దివ్యాంగ ఉద్యోగులకు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వారికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ…