Pregnant Women: ఏజెన్సీ గ్రామాల్లో గర్భిణీలకు తప్పని డోలీ కష్టాలు.. కడుపులోని పసికూన మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Women: ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు కనీస సదుపాయాలు లేక… డోలీలనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణం వారి ప్రాణాల మీదకు కూడా తెలుస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో డోలీలో ఆస్పత్రికి వెళ్లిన ఓ తల్లి… కడపులోనే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పనసబంద గ్రామానికి చెందిన గర్భిణి బానుకు ఈ ఉదయం పురిటి నెప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో… గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీ కట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. డోలీలో రావడం వల్ల… కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్యులు తెలిపారు. డెలివరీ చేసి… ప్రాణం లేని బిడ్డను అప్పగించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండి ఉంటే.. తమ బిడ్డ బ్రతికేదని ఆవేదన చెందుతున్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
కాగా, ఏపీలోని గిరిజన గ్రామాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. సరైన రహదారి సౌకర్యం లేక ఆసుపత్రికి వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే ఇప్పటికీ దిక్కుగా మారాయి.. గిరిజనలపై మాటలతో ప్రేమ చూపించేవారే తప్ప.. వారి బ్రతుకులు మార్చే విధంగా మాత్రం ఆలోచన చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.. ఏపీలో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు అరకొరక సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు వెళ్లడానికి ప్రసవవేదన కు మించిన బాధలను భరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు