Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచాలని ఆదేశించారు. మాస్కో నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా సైన్యం, పౌరుల భద్రతను బలోపేతం చేయడం పుతిన్ ఆదేశం వెనుక ఉద్దేశం. బోర్డర్ డిఫెన్స్ డే సెలవుదినం సందర్భంగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)కి చెందిన బోర్డర్ సర్వీస్‌కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడారు.
రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడికి పాల్పడుతోంది. ఇటీవల వరసగా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గడిచిన మూడు రోజుల్లో దాదాపుగా 40కి పైగా మంది రష్యా దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న సైనిక చర్యగా ప్రారంభం అయిన రష్య, ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారింది. ఇటీవల రష్యా, ఉక్రెయన్ తూర్పు భాగాలు డోన్ బాస్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. తూర్పు ప్రాంతంలోని అనేక పట్టణాలను, నగరాలపై వరసగా దాడులు చేస్తూ రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.