ఏపీలో పీఆర్జీ జీవోలు రద్దుచేయాలని ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో గెజిటెడ్ అధికారుల జేఏసీ చర్చలకు వెళ్ళడంలేదన్నారు. సోమవారం హైకోర్టు నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త పీ ఆర్ సీ అంశం హై కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతాం అన్నారు. గతంలో ఉద్యోగుల హక్కులు కాపాడే…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ పై కీలకంగా చర్చలు జరిగాయి. అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి వచ్చాయి. సమ్మె నోటీసులో పీఆర్సీ, అనుబంధ అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పొందుపరుస్తామన్నారు. వైద్యారోగ్యశాఖ విషయాలను, అక్కడ వున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు. 7వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగుతారన్నారు. పాత జీతం ఇవ్వాలని…