న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి14, 15 ప్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది.
మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మూడోసారి జరిగిన అగ్నిప్రమాదం లవకుష్ ధామ్ శిబిరంలో జరిగినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు.
Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు పరుగులు తీశారు. అనేక అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.
Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.
గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాన్పూర్ లో హింస చెలరేగింది. కొంతమంది రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం కాన్పూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్…