దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మోడీని, ఎన్‌డీఏను ఎదుర్కొనడానికి మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా శరద్‌పవార్ ఇటీవలే దేశంలోని వివిధ పార్టీలతో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని కీలక పార్టీలు హాజరుకాలేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా, సరైన ఫలితాలు ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్యవర్తిత్వంతో పలు పార్టీలు ఇటీవలే ముంబైలోని శరద్‌పవార్ నివాసంలో భేటీ అయ్యాయి. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read: హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇంచార్జ్ లను ప్రకటించిన బీజేపీ
మూడో ఫ్రంట్‌లో కాంగ్రెస్ కూడా ఉండాలని కొన్ని పార్టీలు తెలిపాయి. దేశంలో 200లకు పైగా స్థానల్లో ఆ పార్టీ తన ప్రభావాన్ని చూపుతుందని, కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ సాధ్యం కాదని కొందరి నేతల వాదన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నది. అయితే, బీజేపీని ఢీకొనాలి అంతే, ప్రాంతీయ పార్టీలతో పాటుగా కాంగ్రెస్‌కూడా ఉండాలని నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి శరధ్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం.