సుమారు నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా సమాజంలో జరిగే పరిణామాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన, తాజాగా హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, బాలీవుడ్ ప్రస్తుతం తన మూలాలను కోల్పోయిందని ఘాటు…