ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రైతుల యాత్ర సాగిస్తున్నారు. ఈ యాత్ర ఇవాళ ఆరో రోజు కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమై 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్చూరు వై జంక్షన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు…