తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం.. వారి సమస్యల పైన…
YSR Village Clinics: ఎన్నో సంక్షేమ పథకాలతో అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తుంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలపై ప్రశంసలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) నిరంతర సేవలతో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయంటూ పార్లమెంట్‌కు వెల్లడించింది కేంద్రం… రాష్ట్రంలో నూటికి నూరు శాతం గ్రామీణ పీహెచ్‌సీలు 24 గంటలూ పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు వందకు…
Peddireddy Ramachandra Reddy: నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ చూడలేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి ప్రశంసలు కురపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మంగళగిరిలో అరణ్యభవన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీశాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాక్షించారు.. ఇక, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ పాలన ఉందన్న ఆయన.. నా రాజకీయ జీవితంలో ఇంత మంచి పాలనను ఎప్పుడూ…
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు..…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌లో భారత జట్టు ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం కైల్ జెమీసన్. కివీస్‌లో రాస్ టేలర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ టెస్టు తర్వాత ఎక్కువ పేరు వచ్చింది జెమీసన్‌కే. రెండు ఇన్సింగ్స్‌లలోనూ కలిపి మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన జెమీసన్ భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. జెమీసన్‌పై…
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా…
కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే మన రాష్ట్రము అగ్రగామి వుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు తో రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నాము. దేశంలోనే హాస్పిటల్స్ కు వెళ్లి కరోనా పేషంట్లతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దేశంలోనే నిరంతరం విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వరి కొనుగోలు చేశాము. రైతులకు గిట్టుబాటు ధర…
మతసమరస్యానికి మన రాష్ట్రం ప్రతీక. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ ల వేతనాలు పెంచడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాష హర్షం వ్యక్తం చేసారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో అర్చకులు,పాస్టర్లు, మౌజన్లు,ఇమామ్ లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వీరికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు…
గతంలో వర్షాలు పడితేనే చెరువులు,వాగులు నిండేది కానీ నేడు కాలంతో పనిలేకుండా వాగులు అన్ని మత్తడులు దుంకుతున్నాయి. తెలంగాణ రావడం వల్లనే కాళేశ్వరం జలాలు హల్దీ వాగులోకి వచ్చినాయి అని మంత్రి హరీష్ రావ్ అన్నారు. గత ప్రభుత్వాలకు తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్ళించుడు మాత్రమే తెలుసు.. కానీ తెలంగాణ నీటిని తెలంగాణ పంట పొలాలకు తరలించడం కెసిఆర్ ప్రభుత్వానికి తెలుసు. గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి అప్పజెప్పారు. నేడు గోదావరి…