కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే మన రాష్ట్రము అగ్రగామి వుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు తో రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నాము. దేశంలోనే హాస్పిటల్స్ కు వెళ్లి కరోనా పేషంట్లతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. దేశంలోనే నిరంతరం విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వరి కొనుగోలు చేశాము. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతాంగాని ప్రోత్సాహము ఇస్తున్నాము. కరోనా సమయంలో సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 29 రాష్ట్రాల్లో దేశానికి అన్నం పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుంది అని పేర్కొన్నారు మంత్రి తలసాని.