వారం వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. కొరియోగ్రాఫర్‌గా తెలుగులో ప్రభుదేవాకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కానీ గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. ఇక రీసెంట్‌గా ప్రభు హీరోగా నటించిన మూవీ ‘జాలీ ఓ జింఖానా’. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా…
Maharagni Glimpse: ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. టీజర్ మొదటి షార్ట్ నుంచి…
ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకునే ప్రతి చోటుకి వెళ్లి జెండా ఎగరేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. వెస్ట్ ఈస్ట్ అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఆస్కార్ తెచ్చింది. ఒక ఇండియన్ సాంగ్ కి లేడీ గాగా, రిహన్నా లాంటి…
మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ 14వ సీజన్ ఇటివలే ముగిసింది. కొత్త సీజన్ ని ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టడానికి రెడీ అయిన మల్లెమాల టీం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ‘ప్రభుదేవా’ని రంగంలోకి దించారు. ‘ఢీ’ ఫస్ట్ సీజన్ కి ఫేస్ ఆఫ్ ది షోగా నిలిచిన ప్రభుదేవా, ‘ఢీ’ షో పాపులారిటీని పెంచాడు. డాన్స్ షోకి స్వయంగా ప్రభుదేవానే ప్రమోటర్ అవ్వడంతో, తెలుగు బుల్లితెర అభిమానులు ‘ఢీ’ని సూపర్ హిట్ చేశారు. 2009…
డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలోని ప్రతిభను బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు ఎన్.…
విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటీనటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు రాజీ పడటం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు…
డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలు అందుకున్న ప్రభుదేవా ఆ తర్వాత నటుడి, దర్శకుడిగానూ తన సత్తాను చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో ‘మై డియర్ భూతం’ అనే సినిమా తెరకెక్కుతోంది. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ గా ఈ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న…
చీరకట్టులో నుదుటి బొట్టుతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటూ కనికట్టు చేసింది కొత్త పెళ్ళికూతురు నయనతార. కోరుకున్నవాడితో కొంగు ముడేసుకోగానే కళ్యాణచక్రవర్తి శ్రీనివాసుని దర్శనం చేసుకుంది. అసలే తిరుమల, ఆ పై భక్త జనసందోహం! వచ్చిందేమో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్! ఇక జనం నయన్ ను చూడటానికి ఎగబడకుండా ఉంటారా? చిత్రంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ‘ఫోటో షూట్’ కూడా సాగించింది నయన్. ఇదే పొరపాటు అనుకుంటే ఈ నవ వధువు కాళ్ళకు చెప్పులు వేసుకొని…