Maharagni : డైరెక్టర్ గా మారిన ప్రొడ్యూసర్.. పాన్ ఇండియన్ ‘మహా రాగ్ని టీజర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharagni Glimpse: ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. టీజర్ మొదటి షార్ట్ నుంచి చివరి షాట్ వరకు అత్యంత ఉత్కంఠగా ఉంది. ఈ టీజర్ లో ముఖ్యంగా ప్రధాన క్యారెక్టర్ లను ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంది. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే నసీరుద్దీన్ షా క్యారెక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఇక చివరిగా డైనమిక్ లేడీ, బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. జాతరలో ఫైట్ చేసే సీన్, తను చెప్పే డైలాగ్ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. మహా రాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీజర్ అశేష ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
Extra Jabardasth: ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఏమైందంటే?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ముఖ్యంగా టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ చిత్రానికి పనిచేసిన జీకే విష్ణు మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ లో ఆయన పనితనం గొప్పగా ఆవిష్కరించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి వెన్నెముక అనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. గూస్ బంప్స్ తెప్పించే బిజిఎం అందించారు. టీజర్ కట్ చేసిన విధానం కూడా కట్టిపడేసింది. ఈ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి పనితనం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆర్ట్ వర్క్ గురించి. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి మరో బ్రహ్మాండమైన అప్డేట్ వెలువడనుందని సమాచారం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?