వారం వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. కొరియోగ్రాఫర్‌గా తెలుగులో ప్రభుదేవాకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కానీ గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. ఇక రీసెంట్‌గా ప్రభు హీరోగా నటించిన మూవీ ‘జాలీ ఓ జింఖానా’. శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ అలరించగా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది నవంబరులో, తమిళ్ లో థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా, ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని నేరుగా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 15 నుంచి అంటే ఈ రోజు నుండి ఆహా ఓటిటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘జాలీ ఓ జంఖానా’ మూవీ కథ విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యే తో వీళ్లకు గొడవ అవుతుంది.. దీన్ని నుంచి గట్టెక్కిస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్ళగా అతడు శవమై కనిపిస్తాడు. దీంతో మరో సమస్య మొదలవుతుంది. ఇంతకీ ఎలా చనిపోయాడు? బతికున్నాడని కవర్ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డారనేదే స్టోరీ.