మల్లెమాల ప్రొడ్యూస్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ 14వ సీజన్ ఇటివలే ముగిసింది. కొత్త సీజన్ ని ఆలస్యం చెయ్యకుండా మొదలుపెట్టడానికి రెడీ అయిన మల్లెమాల టీం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ‘ప్రభుదేవా’ని రంగంలోకి దించారు. ‘ఢీ’ ఫస్ట్ సీజన్ కి ఫేస్ ఆఫ్ ది షోగా నిలిచిన ప్రభుదేవా, ‘ఢీ’ షో పాపులారిటీని పెంచాడు. డాన్స్ షోకి స్వయంగా ప్రభుదేవానే ప్రమోటర్ అవ్వడంతో, తెలుగు బుల్లితెర అభిమానులు ‘ఢీ’ని సూపర్ హిట్ చేశారు. 2009 నుంచి ఇదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ ని చేస్తూ వస్తున్నారు. సుధీర్, రష్మి, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణలు ‘ఢీ’కి ఇంకా పాపులారిటీ తెచ్చారు. ఒక సీజన్ ని మించి ఇంకో సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్న మల్లెమాల టీం 14వ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయ్యి డాన్స్ తక్కువ అయ్యింది అనే విమర్శని ఫేస్ చేసింది. ఈ నెగటివ్ కామెంట్స్ కి ఎండ్ కార్డ్ వేయలనో లేక 15వ సీజన్ కాబట్టి స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేశారో తెలియదు కానీ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రభుదేవాకి ‘ఢీ’ షోకి తీసుకోని వస్తున్నారు.
11 డిసెంబర్ సాయంత్రం 7 గంటలకి టెలికాస్ట్ కానున్న ‘ఢీ’ 15వ సీజన్ ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ది కింద ఈజ్ బ్యాక్ అంటూ ప్రభుదేవా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 20014లో జరిగిన ‘ఢీ’ 6వ సీజన్ తర్వాత ప్రభుదేవాని మళ్లీ ‘ఢీ’ స్టేజ్ పైన చూడడం ఇదే మొదటిసారి. ప్రోమోలో ప్రభుదేవాతో పాటు జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లు కూడా ఉన్నారు. ప్రభుదేవా రాకతో ‘ఢీ’ షోలో డాన్స్ తగ్గింది అనే మాటకి ఎండ్ కార్డ్ పడడం గ్యారెంటి. ‘ఛాంపియన్ షిప్ బ్యాటిల్’ అనే ట్యాగ్ లైన్ తో టెలికాస్ట్ కానున్న ఈ 15వ సీజన్ లో సుధీర్, రష్మీలు కూడా ఉంటారో లేదో చూడాలి. 13వ సీజన్ వరకూ తమ జోడితో ప్రేక్షకులని అలరించిన సుధీర్, రష్మీలు 14వ సీజన్ లో చేయలేదు. దీంతో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గింది అనే మాట వినిపించింది.