ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే, ఆ రోజు రావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది కానీ ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. కల్కి సినిమా నుంచి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బర్త్ గిఫ్ట్ రానుంది కానీ అది ఎలాంటి గిఫ్ట్ అనేది అక్టోబర్ 23నే తెలియనుంది.
Read Also: Rakul Preet Singh: చూపులతో మదిని కొల్లగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..
సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న మారుతీ, షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రీప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న హను రాఘవపూడి, అనిమల్ రిలీజ్ అవ్వగానే స్పిరిట్ పనులు మొదలుపెట్టనున్న సందీప్ రెడ్డి వంగ సినిమాల నుంచి కూడా అక్టోబర్ 23న అప్డేట్స్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకెత్తు… సలార్ ఒక్కటీ ఒకెత్తు. సలార్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ప్రభాస్ బర్త్ డే రోజున జరగనుందని సమాచారం. ట్రైలర్ అప్డేట్ రాకుంటే సలార్ సాంగ్ అనౌన్స్మెంట్ అయినా వస్తుందని టాక్. ఈ రెండింటిలో ఏది వచ్చినా కూడా మిగిలిన సినిమాల వార్తలు వినిపించవు. ఇవి చాలవున్నట్లు ఛత్రపతి సినిమా గ్రాండ్ రీరిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ సెలబ్రేషన్స్ రీరిలీజ్ ట్రెండ్ లోనే టాప్ పొజిషన్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సో అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే రోజున… ప్రభాస్ తనతో తానే పోటీ పడి రికార్డ్స్ క్రియేట్ చేయనున్నాడు. ఇక ఆ రోజున సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు తప్ప ఇంకోటి వినిపించదేమో.