పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధ్వర్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మూడు కథానాయికలు కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌లోని హాస్యభరిత డైలాగులు,…
సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్… పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లు కొల్లగొట్టాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత హిట్ కొట్టిన ప్రభాస్… ఇప్పుడు యాక్షన్ మోడ్ లో నుంచి బయటకి వచ్చి వింటేజ్ ప్రభాస్ గా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఆ కటౌట్ కి కాస్త కామెడీ అండ్ హారర్ టచ్ ఇస్తూ, మారుతీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.…
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో……
Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్.. టాప్ 10 లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ మారుతీ. ఈరోజుల్లో అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మారుతీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్.. లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారాడు.
‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ గ్యాప్ లో మరో సినిమాని మొదలుపెట్టాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిన ఆ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు. మారుతీతో సినిమా వద్దంటూ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు చేసి, భారి…
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు దర్శకుడు మారుతితో మరోసారి చేతులు కలపనున్నట్టు ఓ గాసిప్ గుప్పుమంది. ఆల్రెడీ వీరి కలయికలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వచ్చింది. తండ్రి సెంటిమెంట్తో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. తేజ్, మారుతి మరో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపించింది. ఆల్రెడీ వీరి మధ్య కథా చర్చలు నడిచాయని, త్వరలోనే అఫీషియల్…
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్…