‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ గ్యాప్ లో మరో సినిమాని మొదలుపెట్టాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయిన ఆ ప్రాజెక్ట్ ని డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేశారు. మారుతీతో సినిమా వద్దంటూ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో పూజా కార్యక్రమాలు చేసి, భారి ప్రమోషన్స్ చేసి హడావుడి చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ మారుతీ, ప్రభాస్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని లాగించేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపొయింది.
మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని కూడా చిత్ర యూనిట్ మొదలుపెట్టిందని సమాచారం. డిసెంబర్ 8నుంచి ప్రభాస్, మారుతీ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతుందనే విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. హంగామా చేయకుండా షూటింగ్ చేస్తున్న మారుతీ, ప్రభాస్ ని ఇప్పటివరకూ ఎవరూ చూపించని రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడట. ప్రభాస్ లుక్స్ పరంగా కొత్తగా కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న ఇంకో మాటే ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. ‘రాదే శ్యాం’ సినిమాతో లవ్ స్టొరీ చేసి ఫ్లాప్ ఫేస్ చేసిన ప్రభాస్, ఇప్పుడు మారుతీతో హారర్ టచ్ ఉన్న కథ చేస్తున్నాడట. ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ కి హారర్ సినిమా, కామెడీ సినిమాలు ఏం సరిపోతాయి అంటూ ప్రభాస్ ఫాన్స్ నిరాశలో ఉన్నారు. డిజప్పాయింట్ లో ఉన్న ప్రభాస్ ఫాన్స్ కి షాక్ ఇచ్చే రేంజులో మారుతీ, ప్రభాస్ ని చూపిస్తే చాలు పాన్ ఇండియా హిట్ కొట్టినట్లే.