రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది.
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ పేరును ప్రభుత్వం బదనాం చేస్తుందనడంలో ఎలాంటి అర్థం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నారు. అన్నీ చేసింది మీరే కదా అని ఫైర్ అయ్యారు. అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా అని వ్యాఖ్యానించారు.
KCR Writes Letter on Power Purchase Agreements To Justice L Narasimha Reddy Commission: జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని…