కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా…
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులలో 2-1 టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనతో పటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి…
తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు లాక్ డౌన్ పొడిగింపుతో వాయిదా పడ్డాయి. మరోవైపు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ పేర్కొన్నారు. రేపటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఆన్‌లైన్ తరగతుల ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని జలీల్ తెలిపారు.
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలో పెళ్లిచేసుకోనుంది. వీరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న ఈ జంట.. కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. కాగా జూలైలో దేశంలో కరోనా పరిస్థితులు అదుపులో వచ్చే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆ నెలలోనే వీరి వివాహం ఉండనున్నట్టుగా తెలుస్తోంది. అయితే…
ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ…
కరోనా దేశంలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఇంటికి పరిమితం అయ్యారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపార రంగాలు చాలా వరకు కుదేలవయ్యాయి. విలువైన వస్తువుల జోలికి వెళ్లకుండా ఆరోగ్యంపైనే ప్రజలు దృష్టి సారించారు. ఇక ఇదిలా ఉంటె, ఈ కామర్స్ దిగ్గజం ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రైమ్ డే సేల్ ను వాయిదా వేసింది. ప్రతి ఏటా మే నెలలో ఈ సేల్ ను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా…
ఐపీఎల్ సీజన్ 14 పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్ ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగుళూర్ జట్టు బ్లూ జెర్సీ తో బరిలోకి దిగేందుకు…