Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యత 230 కాగా, ఈరోజు(శుక్రవారం) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293గా నమోదు అయింది.