వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించాం అన్నారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్న ఆయన.. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.. సీన్ రీ కనస్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి.. వంశీ అవసరం లేదన్నారు..
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ ఆదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ నాకు ఒక సవాల్ విసిరారు.. దాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్‌పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్‌ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.