పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్దాలు చెబుతారా? 6 గ్యారంటీల అమలు చేస్తే ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా? ఒక్క మహిళకైనా నెలనెలా రూ.2500లు ఇస్తున్నారా? అని ధ్వజమెత్తారు బండి సంజయ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్క రైతుకైనా వడ్లపై రూ.500 బోనస్, రూ.15 వేల భరోసా సొమ్ము ఇస్తున్నారా? ఏ ఒక్క విద్యార్ధికైనా రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా? అని ఆయన అన్నారు. ఏ ఒక్క వ్రుద్దుడికి, వితంతవుకైనా రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా?…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు.
ప్రజలకు ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సంవత్సరం అందరికి మంచే జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మన ప్రాంతాన్ని,మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమ పడాలని సూచించారు. అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఇప్పుడు ఈ క్షణము రేపు ఎల్లుండి వరకు రావచ్చని, పార్లమెంట్ స్థానిక…
గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అధికారంలో నేతన్నల మీద ఉంది శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేతన్నల కోసం ప్రయోజనాలు తీసుకున్నది…
Ponnam Prabhakar: గీతన్న.. నేతన్నా.. వేరు కాదు మీకు అండగా ఉక్కు కవచంలా ఉండే బాధ్యత నాది అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపి బండి సంజయ్ ఢిల్లీలో…
రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..! రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను…
కేటీఆర్‌కి ఎంతో తెలుసు అనుకున్నా.. నీ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ నాయకుడు అధ్యక్షుడు అయ్యాడా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ సీఎం అయ్యాకా అయినా.. బీసీ కి ఇవ్వచ్చు కదా అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధ్యక్షుడు మీరే.. ఫ్లోర్ లీడర్ మీరే.. ఎన్నికల ముందు బీసీ లకు మీ పార్టీ పదవి ఇవ్వండని ఆయన అన్నారు. మీరు బలహీన వర్గాలకు ఇచ్చిన నిధులు ఏంటో చర్చకు…